English | Telugu

నాగచైతన్య దడ ఆడియో రిలీజ్

నాగచైతన్య "దడ" ఆడియో రిలీజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, యువహీరో నాగచైతన్య హీరోగా, ముంబాయి ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "దడ". నాగచైతన్య "దడ" చిత్రాన్ని మలేసియా, బ్యాంకాక్, అమెరికా, హైదరాబాద్ లలో చిత్రీకరించారు. నాగచైతన్య "దడ" చిత్రంలో శ్రీరామ్, అక్ష హీరో నాగచైతన్యకి అన్న, వదినలుగా నటిస్తున్నారు. నాగచైతన్య "దడ" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారు.

జూలై 25 వ తేదీన, హైదరాబాద్ శిల్పారామంలో కల శిల్పకళా వేదికపై, నటసామ్రాట్, పద్మభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు అందుకోగా, అశేష అక్కినేని అభిమానుల సమక్షంలో ఘనంగా మార్కెట్లోకి విడుదల చేయబడింది.ఈ నాగచైతన్య "దడ" చిత్రం ఆడియో రిలీజ్ కు యువ హీరోలు రానా, సుశాంత్, నిర్మాతలు డాక్టర్ కె.యల్.నారాయణ, అల్లు అరవింద్, కె.అచ్చిరెడ్డి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు హాజరయ్యారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.