English | Telugu

ఆ ఇద్ద‌రితో రానా... రాత్రంతా!

రానా అంటే... అచ్చంగా ల‌వ‌ర్‌బోయే. తెర‌పై గంభీర‌మైన పాత్ర‌ల్లో క‌నిపించినా, తెర వెనుక మాత్రం రొమాంటిక్ ప‌ర్స‌నే. ఈ విష‌యం మ‌రోసారి అర్థ‌మైంది. ఆదివారం రానా పుట్టిన రోజు. ఆ రోజు త‌న స్నేహితులందరినీ పిలిచి ముంబైలో ఘ‌నంగా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా...? రానా మాజీ ల‌వ‌ర్ బిపాసాబ‌సు. ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ద‌మ్ మారో ద‌మ్ సినిమాలో న‌టించారు. అప్ప‌టి నుంచీ.. ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగిపోంది. ఆ సినిమా త‌ర‌వాత ఇద్ద‌రూ బ్రేక‌ప్ అయిపోయారు. ఇప్పుడు మ‌రోసారి బిపాసాని పిలిచి మ‌రీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో ల‌క్ష్మీరాయ్ కూడా మెరిసింది. ఈ ఇద్ద‌రితో రానా రాత్రంతా చిందులు వేస్తూ గ‌డిపేశాడ‌ట‌. బిపాసాతో మ‌రోసారి క్లోజ్‌గా ఉండ‌డం చూసి బాలీవుడ్ మీడియా సైతం ముక్కున వేలేసుకొంది. రానాకి హీరోల్లోనూ స్నేహితులున్నారు. వాళ్లెవరినీ ఈ పార్టీకి ఆహ్వానించ‌కుండా కేవ‌లం భామల‌కు మాత్ర‌మే వెల్‌క‌మ్ చెప్పాడంటే... రానాలో రొమాంటిక్ యాంగిల్ ఎంతుందో ఆలోచించండి..!!

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.