English | Telugu

రామ్ కొత్త ప్రయోగం.. రానా హ్యాండ్ కలిసొస్తుందా?

చాక్లెట్ బాయ్ గా, ఎనర్జిటిక్ హీరోగా రామ్ పోతినేనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన ఇమేజ్ కి భిన్నంగా కొన్నేళ్లుగా వరుస మాస్ సినిమాలు చేసి పరాజయాలు చూశాడు. చాలా రోజుల తర్వాత తన ఇమేజ్ కి సరిపొయే 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే ఫ్యాన్ బాయ్ స్టోరీ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాడు. ప్రచార చిత్రాల్లో రామ్ లుక్ ఆకట్టుకుంది. ఇలాంటి రామ్ నే కదా తాము చూడాలనుకుంది అంటూ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ ఫీడ్ బ్యాక్ మహిమో ఏంటో గానీ.. మాస్ జపం మాని, 'ఆంధ్రా కింగ్ తాలూకా' తరహా ట్రెండీ అండ్ డిఫరెంట్ సినిమాలు చేయాలని రామ్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. (Ram Pothineni)

హీరోగా ఇప్పటిదాకా సుమారుగా 20 సినిమాలు చేసిన రామ్.. కొత్త దర్శకులతో పని చేసింది తక్కువే. 'గణేష్', 'కందిరీగ' వంటి రెండు మూడు సినిమాలు మాత్రమే డెబ్యూ డైరెక్టర్స్ తో చేశాడు. వాటిలో 'కందిరీగ' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి రామ్, చాలా కాలం తర్వాత ఓ నూతన దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కిషోర్ గోపు అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథ ఇంప్రెస్ అయిన రామ్.. అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని.. ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి రానా దగ్గుబాటి నిర్మించనున్నాడట. జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.