English | Telugu

రామ్ సినిమాకి 3 పాటలు రెడీ

రామ్ సినిమాకి 3 పాటలు రెడీ అయ్యాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, చురుకైన యువహీరో రామ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, కరుణాకరన్ దర్శకత్వంలో, యువ డైనమిక్ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న విభిన్నమైన ప్రేమకథా చిత్రం" మన లవ్ స్టోరీ". ఈ చిత్రంలోని మూడు పాటలు రికార్డింగ్ పూర్తయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "తొలిప్రేమ" వంటి బ్లాక్ బస్టర్‍ హిట్ నిచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా "హ్యాపీ" వంటి చక్కని చిత్రాన్నిచ్చాడు. అలాగే సుమంత్ హీరోగా "యువకుడు", విక్టరీ వెంకటేష్ హీరోగా "వాసు" వంటి యావరేజ్ సినిమాలూ ఇచ్చాడు. ఇటీవల యశోసాగర్ హీరోగా, స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా "ఉల్లాసంగా-ఉత్సాహంగా" వంటి సూపర్ హిట్‍ చిత్రాన్ని అందించాడు. ఈ చిత్రం మే నెల చివర్లో కానీ జూన్ నెల ప్రారంభంలో కానీ మొదలవుతుందని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.