రోషన్ కనకాల ఆశలని మోగ్లీ 2025 నెరవేర్చిందా!లేదా!
on Dec 13, 2025

-రోషన్ హిట్ అందుకున్నాడా!
-మోగ్లీ ఎలా ఉంది.
-ప్రేక్షకులు ఏమంటున్నారు
-రివ్యూస్ పరిస్థితి ఏంటి!
ఎంతో మంది యాక్టర్స్ కి నటనలో ఓనమాలు దిద్దిన నటనాచార్యుడు దేవదాస్ కనకాల(Devadas kanakala). ఎన్నో చిత్రాల్లో కూడా నటించి ఆయా క్యారెక్టర్స్ కి ప్రాణ ప్రతిష్ట చేసాడు. కుమారుడు రాజీవ్ కనకాల(Rajeevi Kanakala)సినీ రంగంలో తన సత్తా చాటుతు ముందుకెళ్తున్నాడు. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా పరకాయప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మదిలో చాలా కాలం యాదుండేలా చెయ్యడంలో దిట్ట. రాజీవ్ సతీమణి సుమ కూడా యాంకర్ గా, నటిగా తన సత్తా చాటుతుంది. మరి ఈ కుటుంబం నుంచి వచ్చిన 'రోషన్ కనకాల' (Roshan Kanakala)2023 లో బబుల్ గమ్ తో హీరోగా పరిచయమయ్యాడు. అంతకు ముందు వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' అనే మూవీతో సినీ రంగానికి పరిచయమైనా, సోలో హీరోగా మాత్రం 'బబుల్ గమ్' నే. బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది.
దీంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ రోజు 'మోగ్లీ 2025'(mowgli 2025) అనే విభిన్నమైన టైటిల్ తో కూడిన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలర్ ఫొటోతో నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మోగ్లీ తో మెగా ఫోన్ చేపట్టడంతో పాటు ప్రచార చిత్రాలు బాగుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ సినిమాపై నమ్మకంతో నిన్న నైట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ప్రీమియర్స్ చూసిన చాలా మంది ప్రేక్షకులు మాట్లాడుతు 'పాత తరహాలో కథ, కథనాలు సాగడంతో పాటు సందీప్ దర్శకత్వం మెప్పించలేకపోయింది.
రోషన్ నుంచి పెర్ ఫార్మెన్స్ ని రాబట్టడంలో కూడా సందీప్ ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా రివ్యూస్ కూడా నెగిటివ్ గానే వస్తున్నాయి. దీంతో హిట్ ని అందుకోవాలనుకున్న రోషన్ ఆశ మరోసారి నెరవేరకుండా పోయిందనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మోగ్లీ 2025 మూవీ రివ్యూ
అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ లో రోషన్ సరసన మరాఠి భామ సాక్షి మడోల్ కర్(Sakkshi Mhadolkar) జత కట్టింది. తాను పోషించిన జాస్మిన్ క్యారక్టర్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బండి సరోజ్ కుమార్ ప్రతి నాయకుడిగా కనిపించగా వైవా హర్ష మరో కీలకమైన క్యారక్టర్ లో చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



