English | Telugu

లింగ = ఇంద్ర‌??

ఏ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసుకొన్నా.. అంత‌కు ముందొచ్చిన నాలుగైదు హిట్ సినిమాల క‌ల‌యికే అన్న‌ది న‌మ్మ‌క త‌ప్ప‌ని నిజం. తెలుగులోనేకాదు, త‌మిళంలోనూ ఈత‌ర‌హా సినిమాలొస్తున్నాయి. క‌ట్ పేస్ట్ కాక‌పోయినా... గతంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో ప్రేక్ష‌కులు మెచ్చిన అంశాల్ని జోడించి ఓ సినిమా వండేస్తున్నారు. ప్ర‌స్తుతం లింగ కూడా అలాంటి వంట‌క‌మే అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ర‌జ‌నీ లెటెస్టు చిత్రం లింగ‌. ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా 2400 థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతోంది. వేలాది మంది ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్టు కోసం క‌థానాయ‌కుడు త‌న ఆస్తినంతా ధారాత‌త్తం చేస్తాడు. కానీ కొంత‌మంది శ‌త్రువులు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లెడ‌తారు. చివ‌రికి ఎలా పూర్త‌యింది అనేదే క‌థ‌. లింగ క‌థ ఇలా చెప్తూపోతే... దాదాపుగా చిరంజీవి చిత్రం ఇంద్ర‌కు ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి క‌దూ. లైన్ అదే. కాక‌పోతే... ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ ఈ క‌థ‌ని ఓ రేంజ్‌లో తీర్చిదిద్దాడ‌ట‌. ఇంద్ర‌లో చిరు సీమ‌ను వ‌దిలి, మ‌రో చోట మ‌రో జీవితాన్నిప్రారంభిస్తాడు. ర‌జ‌నీ మాత్రం ఈ సినిమాలో మ‌రో జ‌న్మ ఎత్తుతాడు అదే తేడా. ర‌జ‌నీ స్టైల్స్‌, మేన‌రిజం, డైలాగ్స్‌, సాంకేతిక విలువ‌లూ క‌ల‌సి ఈ క‌థ‌కు కొత్త క‌ల‌రింగు ఇచ్చాయి. మ‌రి ఇంద్ర లైన్‌ప‌ట్టుకొని వ‌స్తున్న లింగ తెరపై ఎలా ఉంటుందో చూడాలంటే మ‌రి కొన్ని గంట‌లు ఆగితే చాలు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.