English | Telugu

రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. జపాన్ లో వారున్న ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూమి కంపించి, వారున్న బిల్డింగ్ ఒక్కసారిగా కదలడంతో.. వారు ఎంతో ఆందోళన చెందారు. అయితే అది స్వల్ప భూకంపం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా.. 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ లో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. విడుదలై ఇంతకాలం అవుతున్నా.. ఇప్పటికీ జపాన్ లో 'ఆర్ఆర్ఆర్'కి ఆదరణ లభిస్తుందంటే.. అక్కడి ప్రజలు ఈ సినిమాకి ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంతో అక్కడ రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్ జరగగా.. ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెళ్లారు. అయితే అక్కడ వారికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ సంఘటన గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

"జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో మేము 28వ అంతస్తులో ఉన్నాం. సడెన్ గా బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. భూకంపం అని తెలిసాక మేం భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతున్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం." అని కార్తికేయ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

అలా భూమి కంపించి రాజమౌళి కుటుంబం ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ వాసులు వారికి ధైర్యం చెప్పారట. ఇది ఇక్కడ చాలా కామన్ అని, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసింది స్వల్ప భూకంపమని చెప్పడంతో.. రాజమౌళి ఫ్యామిలీ కూల్ అయిందట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం