English | Telugu

రక్షిత్ శెట్టి సినిమా తొలగింపు.. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండే అని తెలుసా

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా గత సంవత్సరం నవంబర్ లో వచ్చిన మూవీ సప్తసాగరాలు ధాటి సైడ్ బి. కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.

లాస్ట్ ఇయర్ జనవరిలో సప్తసాగరాలు ధాటి సైడ్ బి ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో సైట్ లో ఉంది .కానీ ఇప్పుడు అమెజాన్ తమ సైట్ నుండి తొలగించింది. దీంతో మూవీని చూద్దామని అనుకున్న వాళ్ళు డిజప్పాయింట్ అవుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ,కన్నడ అన్ని భాషల్లోనూ తొలగించింది. కారణాలని కూడా వెల్లడించలేదు .

కాకపోతే సప్త సాగరాలు శాటిలైట్ హక్కులని మొదట జీ 5 కొనులుగోలు చేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అమెజాన్ లో ప్రసారమయ్యింది.తిరిగి జీ 5 లో దర్శనం ఇస్తుందేమో చూడాలి. రక్షిత్ శెట్టి నిర్మాతగానూ వ్యవహరించగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేసింది. సప్త సాగరాలు ధాటి సైడ్ ఎ కి సీక్వెల్ గా సైడ్ బి రూపొందింది. రక్షిత్ శెట్టి నేషనల్ క్రష్ రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అన్న విషయం అందరకి తెలిసిందే.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం