English | Telugu
గామి మేకర్స్ కి మెయిల్ ఐడి పంపించండి..డబ్బులు వేస్తారు
Updated : Mar 21, 2024
ఒక సినిమాకి వందల కోట్లు కలెక్షన్స్ వచ్చాయనుకుందాం. కానీ ప్రొడ్యూసర్ కి లాభాలు వచ్చినట్టు కాదు. ఇది పక్కా నిజం. అలాగే ఒక సినిమా వందల కోట్లు ని సాధించకపోయినా ప్రొడ్యూసర్ కి మాత్రం లాభాలు వచ్చినట్టే. ఇది కూడా నిజం. ఇప్పుడు విశ్వక్ సేన్ గామి ఈ కోవలోకే వస్తుంది. మరీ ఇప్పుడు గామి ప్రొడ్యూసర్ లాభాలని పంచుతున్నాడు.ఎందుకో ఏంటో చూద్దాం.
ఈ నెల 8 న గామి వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. రెగ్యులర్ చిత్రాలకి పూర్తి భిన్నంగా రూపొంది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ కూడా చేసింది. విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ కి అయితే జేజేలు పలుకుతున్నారు. తాజాగా ఈ మూవీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దాటిపోయి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతుంది. దీంతో క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి మేకర్స్ లాభాలని పంచి పెడుతున్నారు. సదరు వ్యక్తులకి ఇమెయిల్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కొంత మందికి మెయిల్స్ వచ్చాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇచ్చిన మాట ప్రకారం నిర్మాతలు లాభాల్ని పంచడం చాలా మంచి పరిమాణం.
క్రౌడ్ ఫండింగ్ అంటే కొంత మంది పబ్లిక్ సినిమాలో పెట్టుబడి పెట్టడం.గామి అలాగే రూపొందింది. ఇక మూవీకి మొదట్లో కొంచం డివైడ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత కాన్సెప్ట్ అర్ధం కావడంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. అలాగే హాలీవుడ్ రేంజ్ లో ఉందనే కితాబుని కూడా అందుకుంది. విశ్వక్ సేన్ కొన్ని రోజుల క్రితం ఒక మాట అన్నాడు. పరిమితుల వల్ల గామి మేకింగ్ లో రాజీ పడ్డాం. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ దొరికి ఉంటే ఇంకా పెద్ద విజువల్ వండర్ అయ్యేదని.ఇది అక్షర సత్యం. ఈ విషయం గామి చూసిన ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. మీలో ఎవరైనా గామి కి క్రౌడ్ ఫండింగ్ చేసుంటే మేకర్స్ కి మెయిల్ చెయ్యండి.