English | Telugu

వాట్ ఈజ్ దిస్ 'రాజా సాబ్'.. పీపుల్ మీడియా ఇలా చేసిందేంటి..!

ఒక బడా హీరో సినిమా రిలీజ్ డేట్ వచ్చిందంటే.. అప్పటికే ఆ డేట్ పై కర్చీఫ్ వేసిన చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలు ముందుకో వెనక్కో వెళ్లడం సహజం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దెబ్బకి యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) సినిమా వాయిదా పడేలా ఉంది. పైగా ఈ రెండు సినిమాలకు ఒక్కరే నిర్మాత కావడం విశేషం.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా సాబ్' (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతోన్న మరో చిత్రం 'మిరాయ్' (Mirai) సైతం వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 10న 'రాజా సాబ్' విడుదల చేయనున్నట్లు ప్రకటించడం చూస్తుంటే.. 'మిరాయ్' విడుదల తేదీ మారడం ఖాయమనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.