English | Telugu

ధనుష్ కి షాకిచ్చిన నిర్మాతల మండలి.. కొత్త సినిమాలు చేయకూడదు!

కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush) కి తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకుని ధనుష్ సినిమాలు పూర్తి చేయకపోవడంతో.. ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదు అంటూ నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా ధనుష్‌తో సినిమా చేయాలంటే.. నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ధనుష్ తమ వద్ద అడ్వాన్స్ తీసుకొని చాలా రోజులవుతున్నా సినిమాలు చేయడం లేదంటూ కొందరు నిర్మాతలు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ధనుష్ తో పాటు మరికొందరు హీరోలది కూడా ఇదే తంతు. నిర్మాతల ఫిర్యాదుతో సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమాలను ప్రారంభించవద్దని తెలిపింది. నిర్మాణ దశలో ఉన్న సినిమాలను అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. స్టార్ హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని చెప్పింది. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.