English | Telugu

అఫీషియల్.. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఎప్పుడంటే..?

కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాకి సీక్వెల్ తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈమధ్య కాలంలో పలు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'లక్కీ భాస్కర్' చేరనుంది. (Lucky Baskhar sequel)

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకోవడంతో పాటు, కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి రివీల్ చేయడం విశేషం. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.

వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఓ మూవీ చేస్తున్నాడు. అనంతరం ధనుష్ తో ఓ సినిమా చేసే అవకాశముంది. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత.. లక్కీ భాస్కర్-2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీక్వెల్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.