English | Telugu
ఇండియన్ సినిమాకి రాజా సాబ్.. అడుగుపెడితే రికార్డులు షేక్...
Updated : Jul 30, 2024
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్.. సినిమా అప్డేట్ వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం కామన్. ఇటీవల 'కల్కి' (Kalki 2898 AD) సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసి, మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు 'రాజా సాబ్' మూవీ గ్లింప్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న క్రేజీ మూవీ 'రాజా సాబ్' (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కలర్ ఫుల్ గా ఉంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించాడు. 'డార్లింగ్' సినిమా రోజులను గుర్తు చేశాడని చెప్పవచ్చు. గ్లింప్స్ లో బైక్ మీద స్టైల్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకొని లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఇక పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళ్లి.. అద్దంలో చూసుకుంటూ తనకి తాను దిష్టి తీసుకోవడం భలే క్యూట్ గా ఉంది.
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఎక్కువగా భారీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. దీంతో వింటేజ్ డార్లింగ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశపడుతున్నారు. ప్రేక్షకుల ఆశను నిజం చేయడం కోసమే.. 'రాజా సాబ్' సినిమా చేస్తున్నట్టున్నాడు ప్రభాస్. తాజాగా విడుదలైన గ్లింప్స్.. ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఫిదా చేసింది. అందుకే ఈ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 20 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. సంచలన వ్యూస్ తో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే.. ఇక సినిమా విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఊహించని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.
"రాజా సాబ్" మూవీ హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతోడ్ని. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు.