English | Telugu
పాటల్లో ఆది శాన్వి ప్రేమ
Updated : Mar 7, 2014
"లవ్లీ" తర్వాత ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. టాకీభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ ఈనెల 11నుండి 18 వరకు విదేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించనున్నారు. ప్రేమకు సరికొత్త అర్థాన్నిచ్చే చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించే ఓ మంచి చిత్రమవుతుంది. ఈ నెల 28న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.