English | Telugu
నితిన్ తో రకూల్ భామ
Updated : Mar 6, 2014
"వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మనోజ్ తో ఓ సినిమాలో నటిస్తుంది. అయితే అల్లరి నరేష్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని, తను నరేష్ సినిమా చేయట్లేదని చెప్పేసింది. ప్రస్తుతం నితిన్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. "హార్ట్ ఎటాక్"తో హ్యాట్రిక్ హిట్టును సొంతం చేసుకున్న నితిన్ ఇటీవలే ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. శ్రవణా పిక్చర్స్ బ్యానర్లో నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నితిన్ సరసన రకూల్ రొమాన్స్ చేయబోతుంది. సోనూసుద్ విలన్ గా కనిపించనున్నాడు. సాగర్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.