English | Telugu
కళ్యాణ్ తో పూరి సినిమా లేదంట...!
Updated : Mar 11, 2014
"హార్ట్ ఎటాక్" చిత్రం తర్వాత ఎవరితో సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్ ప్రస్తుతం మహేష్ "ఆగడు", ఎన్టీఆర్ "రభస", బన్నీ"రేసు గుర్రం", విష్ణు "టెన్షన్ టెన్షన్", చరణ్- కృష్ణవంశీ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరి సినిమాల తర్వాత చాలా మంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. అందుకే పూరి తన తదుపరి చిత్రం హీరో కళ్యాణ్ రామ్ తో చేయబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ వార్తలపై పూరి స్పందిస్తూ.."కళ్యాణ్ రామ్ తో ఇంకా సినిమా అనుకోలేదు. అసలు మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు. కాబట్టి అలాంటిదేం లేదు" అని చెప్పడంతో పాటుగా త్వరలోనే మహేష్ తో మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. మరి పూరి ప్రస్తుతం ఎవరి సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.