English | Telugu

అన్నయ్య నిర్ణయనికి షాకయ్యా-పూరీ జగన్నాథ్

"అన్నయ్య నిర్ణయనికి షాకయ్యా"నని పూరీ జగన్నాథ్ అన్నారు. వివరాల్లోకి వెళితే "ఇడియట్, అమ్మా,నాన్న,తమిళమ్మాయి, పోకిరి" వంటి విభిన్నకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై మాటలన్నారు. ఇటీవల మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి "ఇక మీదట నేను పూర్తిస్థాయి రాజకీయాల్లోనే ఉంటూ ప్రజా సేవ చేస్తాను. సినిమాల్లో నటించను" అని అన్నారు. ఈ స్టేట్ మెంట్ అశేషంగా ఉన్న మెగాభిమానులనే కాక పూరీ జగన్నాథ్ వంటి అనేకమంది దర్శకులను కూడా షాక్ కు గురిచేసింది.

పూరీ జగన్నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ "అన్నయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ చూసి షాకయ్యాను. అన్నయ్య కోసం ఒక చక్కని స్క్రిప్ట్ ని తయారు చేశాను. ఆ స్క్రిప్టులో ఒకవేళ ఆయనకు కావలసిన మార్పులూ, చేర్పులూ చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నయ్యను రాజకీయనాయకుడిగా చూడటమ కంటే ఒక మెగాస్టార్ గా అన్నయ్య సినిమాని చూడటానికి క్యూలో నుంచోవటమే నాకిష్టం" అని అన్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.