English | Telugu

దాసరికి యస్వీఆర్ పురస్కార అవార్డు

దాసరికి యస్వీఆర్ పురస్కార అవార్డు లభించింది. జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారి యస్వీఆర్ పురస్కార అవార్డుని ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణకు అందజేయనున్నారు. జూలై 3 వ తేదీ, సాయంత్రం 6 గంటలకు, రవీంద్ర భారతిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేస్తారు. ఈ యస్వీఆర్ పురస్కార అవార్డు ఫంక్షన్ కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యన్.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

ఈ అవార్డు అందుకోనున్న దాసరి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా తన పేరు నమోదు చేసుకున్నారు. ఆయన 150 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో "తాత-మనవడు" నుండి "ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, మేఘసందేశం, శివరంజని, తూర్పు-పడమర" వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలూ, సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలూ అనేకం ఉన్నాయి.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.