English | Telugu

నిర్మాత సి.కళ్యాణ్ అరెస్ట్

నిర్మాత సి.కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత, బాలాజీ కలర్ ల్యాబ్ అధినేత సి.కళ్యాణ్ ని చెన్నైలో, ఒక గెస్ట్ హౌస్ లో సి.ఐ.డి. పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం సి.కళ్యాణ్ ని విచారణ నిమిత్తం హైదరాబాద్ కి తీసుకు వచ్చారు. సి.కళ్యాణ్ మీద వైజయంతీ రెడ్డికి, షాలిమార్ వీడియోస్ కీ డబ్బులు ఎగ్గొట్టిన కేసుల్లోనూ, అలాగే మద్దులచెరువు సూరి, భాను కిరణ్ ల పేర్లు చెప్పి కొందరిని బెదిరించిన కేసులోనూ ఆయన్ని అరెస్ట్ చేశారు. సి.కళ్యాణ్ కి తనను అరెస్ట్ చేస్తారన్న సంగతి ముందే ఉహించి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేశారు.

అంతే కాక భాను కిరణ్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో సి.కళ్యాణ్ అధీనంలోనే ఉన్నాయనీ, ఇప్పటికీ భానుకిరణ్ తో సి.కళ్యాణ్ కామటాక్ట్ లోనే ఉన్నాడనీ పోలీసులు నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే పెద్ద మొత్తంలో ఖాళీ చెక్కులు సి.కళ్యాణ్ వద్ద పోలీసులకు లభించాయట. గతంలో సి సి యస్ పోలీసులు సి.కళ్యాణ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించినప్పుడు తనకే పాపం తెలియదన్ననిర్మాత సి.కళ్యాణ్ మీడియాకి ఇప్పుడేమని సమాధానం చెపుతారో మరి.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.