English | Telugu

టాలీవుడ్ కి మరో ఎన్టీఆర్

టెంపర్‌ సినిమాలో హీరో ఎన్టీఆర్, విలన్ ఎన్టీఆర్, కమెడియన్ ఎన్టీఆర్, చివరికి ఐటెం కూడా ఎన్టీఆర్' అంటూ చెప్పాడు పూరి.జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇన్నేళ్లలో చేసిన సినిమాలు ఒకెత్తు, టెంపర్‌ ఒకెత్తు అని చెప్పాడు. ఈ సినిమాలో కొత్త ఎన్టీఆర్ టాలీవుడ్ పరిచయం చేయబోతున్నాను, మీరందరూ ఆయన్ని ఆదరించండి అంటూ టెంపర్‌ ఆడియో లో పూరి తనదైన శైలిలో చెప్పాడు. ‘టెంపర్‌’ ట్రెయిలర్‌లో డైలాగ్స్‌ కూడా పూరి జగన్నాథ్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడనే సంగతి తెలియజేసాయి. టెంపర్‌ని మించి కలెక్ట్‌ చేసే సినిమాలు ఎన్నో రావచ్చునని, కానీ ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ ఇచ్చే ఇంపాక్ట్‌ మాత్రం వేరే సినిమాలు ఇవ్వలేవని... అతడిని ఆకాశంలో నిలబెట్టే సినిమా ఇదని పూరి జగన్నాథ్‌ అనడంతో అభిమానులు ఉర్రూతలూగిపోయారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.