English | Telugu

'పీకే' దెబ్బకు వణుకుతున్న థియేటర్లు

అమీర్‌ ఖాన్‌, అనుష్క శర్మలు జంటగా వచ్చిన 'పీకే' సినిమా బాలీవుడ్ రికార్డులు తిరగరాస్తూ సరికొత్త రికార్డ్ లను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ లలోనే కాదు వివాదాల విషయంలోనూ రికార్డులు సృష్టిస్తో౦ది. ఈ సినిమాలో ఉన్న డైలాగ్‌ హిందూవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేవిగా ఉన్నాయని హిందూ లీగల్‌ సెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాలను, హిందువులను అవమానించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. హిందూ లీగల్‌ సెల్‌ ఈ సినిమాపై కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది. తాజాగా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడులు షురూ అయ్యాయి. దేశవ్యాప్తంగా ‘పీకే’ సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలంటూ వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్‌ పిలుపులతో థియేటర్ల యాజమాన్యాలు కంగారుపడ్తున్నాయి. మరి సినిమా దెబ్బకి థియేటర్లు వణకడమంటే ఇదేనేమో!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.