English | Telugu
Kedar Selagamsetty : ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సుకుమార్ కి అడ్వాన్స్ ఇచ్చి...
Updated : Feb 25, 2025
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి(Producer Kedar) దుబాయ్ లో కన్నుమూశారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాను కేదార్ నిర్మించారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసులకు సన్నిహితుడుగా ఆయనకు సినీ పరిశ్రమలో పేరుంది. అలాగే, విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా తీయడం కోసం సుకుమార్ కు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇలా నిర్మాతగా భారీ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న కేదార్ మృతి చెందడం ఇండస్ట్రీని, సన్నిహితులను షాక్ కి గురి చేసింది.