English | Telugu

మోహ‌న్‌లాల్‌తో జ‌వాన్ నాయిక‌!

సౌత్ ఇండియ‌న్ యాక్ట్రెస్ ప్రియ‌మ‌ణికి ఇప్పుడు టాప్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. మోహ‌న్‌లాల్ నెక్స్ట్ సినిమా నెరులో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ నుంచి ఎగ్జ‌యిటింగ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ప్రియ‌మ‌ణి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె నెరు సినిమా క్లాప్ బోర్డుతో ఫొటో పెట్టారు. జీతు జోసెఫ్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. జీతో జోసెఫ్ డైర‌క్ష‌న్ అన‌గానే అంద‌రికీ దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది. ఇవాళ్టి నుంచి నెరు సినిమా షూటింగులో పాల్గొంటున్న‌ట్టు ప్రియ‌మ‌ణి పోస్టు పెట్టారు. ఒన్ అండ్ ఒన్లీ మోహ‌న్‌లాల్ సార్‌, జీతు ఫ‌రెవ‌ర్ అంటూ హీరోని, డైర‌క్ట‌ర్‌నీ కూడా ట్యాగ్ చేశారు. మోహ‌న్‌లాల్ హీరోగా జీతు జోసెఫ్ డైర‌క్ట్ చేస్తున్న ఐదో సినిమా ఇది.

దృశ్యం ఫ్రాంచైజీ త‌ర్వాత రామ్ సినిమా చేశారు. ఇప్పుడు నెరు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కోర్టు రూమ్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఇందులో మోహ‌న్‌లాల్ లాయ‌ర్‌గా క‌నిపిస్తారు. ఆగ‌స్టు నుంచి షూటింగ్ జ‌రుగుతోంది. ఒక చెయిర్‌లో మోహ‌న్‌లాల్ కూర్చుని ఉండ‌టం, పుస్త‌కం చ‌దువుతూ ఉండ‌టాన్ని ఫ‌స్ట్ లుక్‌గా అప్పట్లో విడుద‌ల చేశారు. వెన‌క ఉన్న ఫొటోలో యంగ్ లాయ‌ర్‌గా ఆయ‌న ఫొటో ఉన్న పిక్ కూడా ఆక‌ట్టుకుంది. స‌తీష్ కురూప్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. విష్ణు శ్యామ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వి.య‌స్‌.వినాయ‌క్ ఎడిట‌ర్‌. జ‌వాన్ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేసిన ప్రియ‌మ‌ణి నేరుగా ఈ సినిమా సెట్స్ కే వెళ్లారు. షారుఖ్ అట్లీ జ‌వాన్ సినిమాలో ప్రియ‌మ‌ణి కేర‌క్ట‌ర్‌కి కూడా మంచి అప్లాజ్ వ‌స్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్ త‌ర్వాత షారుఖ్‌తో సెకండ్ టైమ్ న‌టించారు ప్రియ‌మ‌ణి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.