English | Telugu
‘సలార్’ మేకర్స్‌పై ఫ్యాన్స్ గుర్రు
Updated : Aug 16, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్‌కి సిద్ధం చేస్తోన్న పాన్ ఇండియాల లిస్టు పెద్దగానే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ఆదిపురుష్ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ‘సలార్’ ఉంది. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించేశారు. విడుదలకు యాబై రోజులు కూడా లేదు. అయితే సినిమాను నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ కొన్ని పోస్టర్స్, రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మినహా ఏమీ లేదు. ఇంకా ‘సలార్’ నుంచి పాటలు రావాల్సి ఉంది. టీజర్, ట్రైలర్ ఉంది. వీటితో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉన్నాయి. ఇంత పని ఉన్నప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.
‘సలార్’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు కొందరు హార్డ్ కోర్ అభిమానులైతే మేకర్స్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దయచేసి అప్‌డేట్స్ ఇవ్వడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఓ ఫ్యాన్ మేడ్ సాంగ్‌ను రెడీ చేసి రిలీజ్ చేయటం విశేషం. ఈ సాంగ్ సూపర్బ్‌గా ట్రెండ్ అవుతోంది. మరి ఫ్యాన్స్ ఎగ్జయిట్‌మెంట్‌ను చూసి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. సినీ సర్కిల్స్ సమాచారం మేరకు సలార్‌లో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి.
మోస్ట్ వయొలెంట్ మ్యాన్ ‘సలార్’గా ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. ఇంది రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 28న తొలి భాగంగా సలార్ సీజ్ ఫైర్ రానుంది. మరి రెండో భాగం ఎప్పడు వస్తుందో చూడాలి మరి.