English | Telugu

టీజర్ దెబ్బకి 30కోట్ల బిజినెస్..!

మాస్ మహారాజ రవితేజ 'పవర్' సినిమా షూటింగ్ ఓ పాట చిత్రీకరణ మినహా మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో కావల్సిన పవర్ వచ్చి చేరింది. అసలు విషయం ఏమిటంటే..రవితేజ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న టైంలో బలుపుతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తరువాత కొత్త దర్శకుడితో 'పవర్' సినిమాని స్టార్ట్ చేశాడు. రవితేజ 'పవర్'తో బయటపడవచ్చని నిర్మాతలు కూడా భావించారు. అయితే కొత్త దర్శకుడు కావడంతో సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి డిస్టిబ్యూటర్స్ ఆ సినిమాని పట్టించుకోలేదు. దీంతో వారు కొంత కలవరానికి గురవుతున్న టైంలో 'పవర్' టీజర్స్ రిలీజై సినిమాకి మంచి క్రేజ్ తెచ్చాయి. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఈ చిత్రం రూపొందిందని టాక్ తేవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. రవితేజ కేరియార్ లోనే రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసిందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 23.5 కోట్లు జరిగిందట. నైజాం 7.5కోట్లు, ఎపి రైట్స్ 12కోట్లు, కర్ణాటక 2కోట్లు, ఓవర్ సీస్, మిగిలిన ఇండియా రైట్స్ కలిపి 2 కోట్లు పలికాయట. ఇక ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5కోట్లు చేశాయట. మొత్తం కలిపి 30కోట్ల బిజినెస్ రాబట్టిన ఫుల్ ఖుషీగా వున్నారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.