English | Telugu

ఇది నార్మల్ కాదు.. కోర్టు తీరుపై పూనమ్ కౌర్ అసహనం!

కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగిన 162 రోజుల తర్వాత దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ కోల్‌కతా లోని సియాల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసు కోల్‌కతా హైకోర్టుకి చేరింది. తాజాగా ఈ కేసుపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. (Poonam Kaur)

పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జీకర్ ఘటనపై స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. హత్యాచార ఘటనలను సాధారణంగా చూడటం లేదా సాధారణ కేసుగా పరిగణించడం కరెక్ట్ కాదని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అరుదైన కేసు కాదని కోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. హత్యాచార ఘటనను మన దేశంలో ఒక సాధారణ విషయంగా మార్చాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టాలని పూనమ్ కౌర్ కోరారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.