English | Telugu

బయటపడిన పొలిమేర 2, గుంటూరు కారానికి మధ్య ఉన్న రిలేషన్

ఇటీవల వచ్చిన మా ఊరి పొలిమేర 2 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. చిన్న చిత్రంగా విడుదల అయిన ఆ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించింది. ఆ సినిమా ప్రేక్షకులకి చేరువయ్యేలా మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసిన వారు వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని. ఈ ఇద్దరే పొలిమేర 2 ని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేసారు. తాజాగా ఇప్పుడు ఒక అగ్ర హీరో సినిమాకి ఆ ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గుంటూరు కారంని కృష్ణ జిల్లా వ్యాప్తంగా పంపిణి చేసే హక్కులని వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని లు దక్కించుకున్నారు.అలాగే తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ ని కూడా ఈ ఇద్దరే కృష్ణ జిల్లాలో పంపిణి చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని వంశీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసాడు. అలాగే ఆ రెండు సినిమాలని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని కూడా వంశీ .అన్నాడు.

గుంటూరు కారం రిలీజ్ హక్కుల కోసం ఎంతోమందిప్రయత్నించినా కూడా పొలిమేర 2 ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు పొందటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ రేట్ ని చెల్లించి వంశీ ఆ హక్కులని సంపాదించాడని తెలుస్తుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.