English | Telugu

ప‌వ‌న్‌కి తిక్క‌రేగింది

తెలుగు చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ ఎంతో వైభ‌వంగా చేసిన మేము సైతంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాలేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. ప‌వ‌న్ ఏడీ? ఎక్క‌డ‌? ఎందుకురాలేదు? అన్న ప్ర‌శ్న‌లు ఇప్ప‌టికీ ఉద్భ‌విస్తూనే ఉన్నాయి. ప‌వ‌న్ అనారోగ్యం వ‌ల్లే ఈ కార్య‌క్ర‌మానికి రాలేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్పారు. అయితే అస‌లు కార‌ణం అది కాద‌ట‌! మేము సైతం ప‌ట్ల ప‌వ‌న్ ముందు నుంచీ విముఖ‌తతోనే ఉన్నాడ‌ని, అందుకే ఆహ్వానం అందింనా ప‌వ‌న్ రాలేద‌ని చెప్పుకొంటున్నారు. ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి, మ‌ళ్లీ వాళ్ల‌కే ఇవ్వ‌డం అర్థం లేని విష‌య‌మ‌ని, మ‌రీ అంత‌గా సాయం చేయాలంటే సొంత జేబుల్లోంచి తీసిస్తే బాగుంటుంద‌నేది ప‌వ‌న్ అభిప్రాయంగా తెలుస్తోంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు... ఇలా ప్ర‌తి ఒక్కరూ ల‌క్షకు త‌క్కువ కాకుండా త‌మ‌కు తోచిన స‌హాయం చేస్తే ఇంత‌కంటే ఎక్కువే పోగేసేవాళ్ల‌మ‌ని.. ప‌వ‌న్ త‌న స‌న్నిహితుల‌తో చెప్పాడ‌ట. ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర నుంచే కూప‌న్ల రూపంలో డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ని, అందుకే తిక్క‌రేగి ఈ కార్య‌క్ర‌మానికి రాలేద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఆలోచ‌న కూడా నిజ‌మే. 15 రోజుల పాటు అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి... భారీ ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే మ‌న‌వాళ్లు పోగేసింది మూడు కోట్లు కూడా లేదు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ఇచ్చిన 11.5 కోట్ల రూపాయ‌ల్లో తార‌లు విరాళాలుగా ఇచ్చిందే రూ.5 కోట్ల‌ట‌. మిగిలిన మూడున్న‌ర‌.. శాటిలైట్‌ద్వారా వ‌చ్చిన‌వి. అంటే.. మేము సైతం ద్వారా పోగేసింది మూడు కోట్ల‌లోపే. ఈమాత్రం దానికి ఇంత హ‌డావుడి ఎందుకో మ‌రి..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.