English | Telugu

అల్లు అరవింద్ సపోర్ట్‌... పవన్ OG రెండు పార్టులుగా రానుందా?

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం ప్రారంభమైంది. దీనికి ఓజి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను పెట్టారు ఓ జి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్ట‌ర్. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొంద‌నుంద‌ని సమాచారం. ఈ సినిమాలో పాటలు ఫైట్లు ఉండవట. అయినా ఇది ఒక గ్యాంగ్ స్ట‌ర్ చిత్రం కావడం విశేషం. మొదటి భాగాన్ని అక్టోబర్ 23న దసరా కానుకగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామి అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఆయన వెనుక నుంచి సైలెంట్ గా ఫైనాన్స్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు స్టూడియోస్ లో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఇక ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన పనులు కూడా అల్లు అరవింద్ స్వయంగా చూసుకోబోతున్నారని అంటున్నారు.

ఈ చిత్రంలోని ప్రతి విషయంలోనూ అల్లు అరవింద్ హస్తం ఉందని టాలీవుడ్ మీడియా అంటుంది. అందులో నిజం ఏంటో తెలియదు గానీ ప్రస్తుత మాత్రం ఈ ప్రచారం ఊపందుకొంది. సాహో తర్వాత దాదాపు నాలుగు ఏళ్ల విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశారు. పైగా అతను పవనుకు వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవెల్ లో ఉంటుందా అని అభిమానులు అందరూ భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇందులో అల్లు అర‌వింద్ భాగ‌స్వామి కావ‌డంతోనే ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, వినోదాయ‌సిత్తం రీమేక్ల‌ను కాద‌ని ముందుగా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడ‌ని అంటున్నారు. అయితే పవన్ చిత్రంలో పాటలు ఫైట్స్ లేకుండా ఉంటే వాటిని ప్రేక్షకులు, అభిమానులు ఏ విధంగా స్వీకరిస్తారు? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. మరి మొత్తానికి సుజిత్ పవన్‌తో ఎలాంటి చిత్రం చేయనున్నాడు అనేది OG తో తేలిపోనుంది. ఈ సినిమాకి పంజా, సాహో చిత్రాల లాగా కాకుండా కేజిఎఫ్, పఠాన్ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రు చూడ‌ని రీతిలో ఈ చిత్రం క్లైమాక్స్ టెర్రిఫిక్ గా ఉంటుంద‌ని స‌మాచారం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.