English | Telugu
అనుపమ పరమేశ్వరన్ కి భారీ షాక్ !
Updated : Aug 23, 2025
'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'పరదా'(Paradha).ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న 'పరదా' నిన్న వరల్డ్ వైడ్ గా తెలుగు, మలయాళ భాషల్లో మెజారిటీ స్క్రీన్స్ లో విడుదలైంది. సినిమా బండి, శుభం వంటి విభిన్న చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కించాడు. దర్శన రాజేంద్రన్(Darshana Rajendran)గౌతమ్ వాసుదేవ మీనన్, సంగీత, రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించగా, ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు, విజయ్, శ్రీధర్ నిర్మించారు. గోపి సుందర్(Gopisundar)సంగీతాన్ని అందించాడు.
పరదా తొలి రోజు తెలుగులో ఫస్ట్ డే 12 లక్షల రూపాయలు, మలయాళంలో ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ సమస్య వల్ల మలయాళ వెర్షన్ లో టైంకి రిలీజ్ కాలేదు. దీంతో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తుంది. టోటల్ గా తెలుగు, మలయాళం లో కలుపుకుంటే 18 లక్షలు. గ్రాస్ ని యాడ్ చేస్తే, మరో రెండు లక్షలు చొప్పున 20 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో చూసుకుంటే ఆరు వేల డాలర్లు రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా పరదా తక్కువ కలెక్షన్స్ రాబట్టడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పరదా చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ వినూత్నంగా ప్రచారం చేసారు. అనుమప పరమేశ్వరన్ కూడా పబ్లిసిటీ విషయంలో అంతా తానై వ్యవహరించింది. రివ్యూలు నచ్చితేనే సినిమాకి రండని కూడా చెప్పింది. మొదటి రోజు మూవీ చూసిన ప్రేక్షకులు మూవీ బాగుందనే చెప్తున్నారు. రివ్యూలు కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.