English | Telugu

వావి వరుసలు లేని క్రిమినల్ ప్రేమకథ


సమాజంలో అమ్మాయిలు ఎదుర్కుంటున్న అతి దుర్భరమైన సమస్యలలో కొన్నింటిని తెర మీద చూపించేందుకు సునీల్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం 'ఒక క్రిమినల్‌ ప్రేమకథ' చిత్రం. సామాజిక సమస్యలను లేవనెత్తుతు తీసుకున్న అంశం మంచిదే అయినా ఈ చిత్రంలో కొన్ని సన్నివేషాలు థియేటర్లో చూడడానికి ఇబ్బందిగా అనిపించక మానదు.

కథ విషయానికి వస్తే...
పల్లెటూర్లో చదువుకుంటున్న బిందు (ప్రియాంక పల్లవి) దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబంతో సహా వైజాగ్ లో మేనమామ(సత్యానంద్) ఇంటికి వస్తుంది.
లేత ప్రాయంలో వున్న బిందుతో, వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తుంటాడు మేనమామ. ఎదురించలేని అసహాయత, అయిష్టం మధ్య నలిగిపోతూ వుంటుంది బిందు. ఈ క్రమంలో బిందూని ప్రేమించిన శీను (మనోజ్‌నందం) ఆమెను కలుస్తాడు. అతను తన నిజమైన ప్రేమికుడని గ్రహిస్తుంది. కానీ అతనికి తనపై గల ప్రేమను అడ్డం పెట్టుకుని ఒక షరతు విధిస్తుంది. తనని ప్రేమిస్తున్నది నిజమైతే ఒక వ్యక్తిని చంపమని కోరుతుంది. ఈ విషయం విని షాక్ అయిన శీను తర్వాత ఏం చేస్తాడు అనేది తర్వాత కథ..

మిగతా విషయాలు...
చిత్రంలో ఎంచుకున్న అంశం చాలా సున్నితమైంది. ఈ అంశాన్ని ప్రేక్షకుడిగా తప్పకుండా తెలియచెయ్యాలి, ఆలోచింప చెయ్యాలి అనే కోణం మంచిదనిపిస్తుంది. అదే సమయంలో చాలా అవసరం అని చిత్రీకరించిన కొన్ని రకాల దృష్యాలు, రెగ్యులర్ సినిమాల్లో చూడడానికి ప్రేక్షకులు ఇంకా రెడీగా లేరనే చెప్పాలి. సెక్సువల్ సీన్స్, రేప్ సీన్స్ ఇబ్బంది పెడతాయి.

నేటి సమాజంలో ఆడపిల్లలపై పైశాచికంగా జరుగుతున్న అకృత్యాలకు లెక్క లేదు. వాటిపై ఇంత లోతైన అధ్యయనం జరిపి కథా వస్తువుగా అలాంటి అంశాలను ఎంచుకుని, ధైర్యంగా తెరకెక్కిస్తున్న దర్శకుడిని అభినందించకుండా వుండలేం.
అయితే ఈ అంశాలు ప్రతి వారికి తెలియాలి, రీచ్ అవ్వాలి అంటే ఎబ్బెట్టుగా వుండే దృష్యాలు వేరే విధంగా తీసే ప్రయత్నం చేస్తే బాగుంటందనిపిస్తుంది. ముఖ్యపాత్రలు పోషించిన మనోజ్, పల్లవి, సత్యానంద్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.