English | Telugu

ప్చ్‌.. చిరు పక్క‌న హీరోయిన్ లేదు

చిరంజీవి రీ ఎంట్రీ అంటే మాట‌లా?? ఈసారి ఎంట్రీ అదిరిపోవాలి. అదీ... ఏడేళ్ల త‌ర‌వాత చిరుని వెండి తెర‌పై చూడ‌బోతున్నారు అభిమానులు. పాట‌లు, ఫైట్లు, డైలాగులు ఎందులోనూ లోటు రాకూడ‌దు. ఈ విష‌యాల్లో త‌న స్టామినా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని చిరుకూడా నిరూపించుకోవాలాయె.

అందుకే... శ్రీ‌నువైట్ల గ‌ట్టి స్కెచ్చే వేశాడు.ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బ్రూస్లీలో చిరు ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసింది. చిరు కోసం ఓ పాట‌, ఓ ఫైటు డిజైన్ చేశారు. ప‌తాక స‌న్నివేశాల‌కూ చిరు పాత్ర‌తో లింకు పెట్టారు. ఆ మాట‌కొస్తే.. హీరో పాత్ర‌కు ఏమాత్రం తీసిపోని విధంగా చిరు పాత్ర‌ని సృష్టించారు. చిరు - చ‌ర‌ణ్‌ల పాట కోసం ఐటెమ్ భామ కావ‌ల్సొచ్చింది. ఇలియానా, త‌మ‌న్నా పేర్లు పరిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే ఇలియానా పారితోషికం పేరుతో నిర్మాత‌ని బెదిరించేస‌రికి, త‌మ‌న్నాతో స‌ర్దుకుపోదామ‌నుకొన్నారు.

ఇప్పుడు త‌మ‌న్నా కూడా హ్యాండిచ్చేసింది. దాంతో.. ఇప్పుడు హీరోయిన్ లేకుండానే ఈ పాట‌ని తెర‌కెక్కించేద్దాం అని భావిస్తున్నార‌ట‌. చిరు, చ‌ర‌ణ్ డాన్స్ చేస్తుంటే.. ఇక హీరోయిన్‌ని ఎవ‌రు ప‌ట్టించుకొంటారన్న‌ది చిత్ర‌బృందం లాజిక్‌. మ‌రి ఈ తెలివితేట‌లు ముందు ఎందుకు లేవో..??

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.