English | Telugu

"ఫెయిర్ అండ్ లవ్లీ"కి నితిన్ అంబాసిడర్

ప్రముఖ తెలుగు యువ సినీ హీరో నితిన్ ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు.ప్రముఖ ఫేస్ క్రీమ్ కంపెనీ "ఫెయిర్ అండ్ లవ్లీ"కి,"మ్యాక్స్ ఫెయిర్ నెస్ క్రీమ్ ఫర్ మెన్" అనే ప్రోడక్టులకు హీరో నితిన్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయనున్నాడు.ఈ ప్రోడక్ట్ కి ఆలిండియా లెవెల్లో గతంలో నేటి ప్రముఖ తెలుగు హీరోయిన్ ఇలియానా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది.ఆ యాస్ లో ఆమెను చూసిన దర్శకుడు వై.వి.యస్ చౌదరి తన "దేవదాస్" చిత్రంలో హీరోయిన్ గా అవకాశమిచ్చాడు.

ఆ చిత్రంతో ప్రారంభించి నేడు ప్రముఖ హీరోయిన్ గా ఇలియానా నిలిచింది. తేజ"జయం" చిత్రం తర్వాత ఇంతవరకూ హీరో నితిన్ కు ఆ రేంజ్ హిట్ ఇంతవరకూ రాలేదు.అలా ఫ్లాపుల్లో ఉండి ఫేడవుట్ అవుతున్న హీరో నితిన్ కూడా ఈ "ఫెయిర్ అండ్ లవ్లీ", "మ్యాక్స్ ఫెయిర్ నెస్ క్రీమ్ ఫర్ మెన్" యాడ్ లతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తాడేమో వేచి చూడాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.