English | Telugu

రానా నేను-నా రాక్షసి జిఫ్ కి ఓవర్ సీస్

రానా "నేను-నా రాక్షసి" జిఫ్ కి ఓవర్ సీస్ హక్కులు లభించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో "లీడర్", "దమ్ మారో దమ్" ఫేం రానా హీరోగా, నలక నడుము ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్నప్రేమ కథా చిత్రం "నేను-నా రాక్షసి". ఈ చిత్రం ఓవర్ సీస్ హక్కులను జిఫ్ అంటే గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు చేజిక్కించుకున్నారు. ఇందుకు గాను 13 రెగ్యులర్ ప్రింట్లనూ, 8 డిజిటల్ ప్రింట్లనూ ముంబాయి నుంచి న్యూయార్క్ సహా అనేక ప్రదేశాలకు ఎయిర్ ఇండియా విమానాల్లో పంపటం జరిగింది.

రానా "నేను-నా రాక్షసి" చిత్రానికి విశ్వ, రెహమాన్ పాటలకు సంగీతాన్నందించగా, అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోరునందించారు. ఏప్రెల్ 29 వ తేదీన, అంటే రేపే విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారన్నమాట. ఈ చిత్రం రానా సినీ జీవితంలో మూడవది కాగా తెలుగులో రానాకిది రెండవ చిత్రం. ఈ చిత్రంలో రానా ఒక కిరాయి హంతకుడిగా నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.