English | Telugu

నేను నా ఫ్రెండ్స్ ఆడియో విడుదల

సందీప్, సిద్ధార్థ వర్మ, హరీష్, రవి, విష్ణుప్రియ, అంజనా దేశ్ పాండే, హారిక, కృతిక నాయకనాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం "నేను నా ఫ్రెండ్స్". జిఎస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయిమేధ రమణ, ఓరుగంటి మధుసూధన్ నిర్మిస్తున్నారు. చిన్ని చరణ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. తొలిసీడీని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించారు. స్నేహం నేపథ్యంలో రూపుదిద్దుకున్న కథ ఇది ఈ చిత్రం అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.