English | Telugu

నాని హీరోగా కృష్ణవంశీ చిత్రం పూజయ్యింది

నాని హీరోగా కృష్ణవంశీ చిత్రం పూజయ్యింది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, "అష్టాచమ్మా, భీమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది" చిత్రాల్లో హీరోగా నటించిన యువహీరో నాని హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మిస్తున్న సినిమా పూజాకార్యక్రమాలు వారి కార్యాలయంలో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై రెండవ వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా ఒక నూతన సంగీత దర్శకుణ్ణి, ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేయనున్నారట.

ఈ సినిమాలో హీరో నాని సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. ఆ హీరోయిన్లు ఎవరనేదీ ఇమకా తెలియరాలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబడుతున్న "ఈగ" సినిమాతో హీరో నాని బిజీగా ఉన్నాడు. అలాగే గోపిచంద్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న "మొగుడు" సినిమా షూటింగుతో కృష్ణ వంశీ బిజీగా ఉన్నాడు. మొగుడు, నాని సినిమాలకు కృష్ణవంశీ ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.