English | Telugu

'మనం' ఛానెల్ లేదు.. అన్నీ పుకార్లే

తెలుగు ప్రజల కోసం త్వరలో మరో ఎంటర్‌‌‌టైన్మెంట్ ఛానెల్ రాబోతుందని, దీనిని అక్కినేని నాగార్జున..ప్రసాద్ వి.పొట్లూరి కలిసి లాంచ్ చేయబోతున్నారని గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు హంగామా చేస్తున్నాయి. 'మా' ఛానల్లో మేజర్ వాటాలను స్టార్ నెట్‌‌‌‌‌వర్క్ దక్కించుకున్న తరువాత నాగార్జున ‘మనం’ ఛానల్ లాంచ్ చేయాలని భావించారన్నది ఈ వార్తల సారాంశం. అయితే తాజాగా ఈ వార్తలను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వార ఖండించారు. నేను 'మనం' పేరు మీద ఓ ఎంటర్‌‌‌టైన్మెంట్ ఛానెల్ లాంచ్ చేయబోతున్నానని వస్తున్న వార్తలన్ని కేవలం కల్పితమేనని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం నాగార్జున వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్ తో బిజీగా వున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.