English | Telugu

'మా' ఉత్కంఠకు తెర..శుక్రవారం ఫలితాలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయ్యింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడికి న్యాయస్థానం నుంచి ‘గ్రీన్‌ సిగ్నల’ పడటంతో శుక్రవారం కౌంటింగ్‌ నిర్వహించి, అదే రోజు ఫలితం వెల్లడిరచేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ వెల్లడి౦చారు. సుమారు వెయ్యి మంది కూడా లేని ‘మా’లో అనేక రాజకీయ వివాదాలు తెరపైకొచ్చాయి ఈసారి. గతంలోనే ‘మా’ ఎన్నికలు జరిగినా, ఫలితాలు వెల్లడి కాకుండా ఆగిపోయిన విషయం విదితమే. అయితే న్యాయస్థానం ఓ.కళ్యాణ్‌ పిటిషన్‌ని డిస్మిస్‌ చేసి, ఆయనకు పదివేల రూపాయల జరీమానా కూడా విధించింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి చేసుకోవచ్చని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సీనియర్‌ నటులు జయసుధ, రాజేంద్రప్రసాద్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన విషయం విదితమే.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.