English | Telugu

నాగార్జున "తులాభారం"

ప్రముఖ తెలుగు సినీ హీరో యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల త్రిచూర్ లో ఒక పెళ్ళికి హాజరయ్యారు.ఆ పెళ్ళి నుంచి వస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్న గురువాయూర్ లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళారు.అక్కడికి వెళ్ళిన నాగార్జున అక్కడ దేవాలయంలో కదళీ ఫలాలతో తులాభారం తూగారట.కదళీఫలం అంటే అరటి కాయ అని అర్థం.నాగార్జున బరువు 77 కేజీలు.అంత బరువు అరటి పళ్ళను అక్కడి దేవాలయానికిచ్చారట ఆయన.మరి ఏం మొక్కుకున్నారో ఏమోమరి.తన మొక్కుబడిని తీర్చుకున్నారు.ఆయన పని మీద ఆయనుంటే అక్కడ కూడా నాగార్జునను గుర్తుపట్టిన అభిమానులు ఆటోగ్రాఫ్ ల కోసం ఆయన వెంటపడ్డారట.

 

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.