English | Telugu

దర్శకురాలిగా పి.ఆర్.పి.లీడర్

పి.ఆర్.పి.అంటే ప్రజారాజ్యం అని కదా అర్థం.ఆ పార్టీ అధ్యక్షులు చిరంజీవి ఏకంగా 30 యేళ్ళ పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన సంగతి మనకు తెలిసిందే.ఆయన సుప్రీమ్ హీరో అయినా,మెగా స్టార్‍ అయినా, పద్మభూషణ్ అయినా, డాక్టర్ చిరంజీవి అయినా అదంతా తెలుగు సినిమా చలవే.ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి కూడా తన నాయకుని బాటలోనే నడవటానికి సన్నాహాలు చేస్తూందట.అలాగని ఆమె కూడా ఏ నటిగానో సినిమాల్లో నటించబోతూందని కాదు.దర్శకురాలిగా తెరంగేట్రం చేయనుందట శోభారాణి.ఈమె దర్శకత్వం వహించబోయే చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నతీస్తూందని సమాచారం.ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో నిర్మించే చిత్రమని తెలిసింది

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.