సమంత, రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా!.. రాజ్ ఆస్థి విలువ ఎంత
on Dec 1, 2025

-అభిమానులు హ్యాపీ
-రాజ్ ఎవరు
-ఆస్థి ఎంత
-ఏజ్ గ్యాప్ ఎంత!
ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ 'సమంత'(Samantha)తన అభిమానుల కోరిక ప్రకారం మళ్ళీపెళ్లి పీటలెక్కింది. ఈ రోజు ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడమోరు'(Raj Nidamoru)ని తమిళనాడు కోయంబత్తూర్ లోని 'లింగ భైరవి'(Linga Bhairavi)ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఇద్దరి యాష్ ట్యాగ్స్ కూడా ట్రేండింగ్ లో నిలుస్తున్నాయి. దీంతో ఆ ఇద్దరికి సంబంధించిన పలు విషయాలపై అభిమానుల్లో చర్చ జరుగుతుంది.
సమంత 2022 వ సంవత్సరంలో 'యశోద' అనే మూవీ చేసింది. ఆ టైంలో సమంత మయోసైటిస్(Myositis)అనే అరుదైన వ్యాధికి గురయ్యింది. ఈ విషయాన్ని అభిమానులతో కూడా పంచుకొని సదరు వ్యాధి వల్ల ఎప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ తెలియచేసింది. అంతకు ముందు ఏడాది రాజ్ నిడమోరు దర్శకత్వంలో ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో సమంత చేసి ఉండటం, సమంత వ్యాధి గురించి కూడా రాజ్‌కి తెలియడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ కూడా తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాడు. అప్పట్నుంచి ఇద్దరు జర్నీ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు చెన్నై పికిల్ బాల్ టీమ్‌కి కో ఓనర్స్ గా వ్యవహరిస్తు వస్తున్నారు.
also read: విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. కమల్ స్టైల్ అంటే ఇదే
వయసురీత్యా సమంత, రాజ్‌కీ మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్. రాజ్ 1975లో పుట్టగా, సమంత 1987లో పుట్టింది. రాజ్ స్వగ్రామం తిరుపతి. అక్కడే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టి తన స్నేహితుడు డికే తో కలిసి సంయుక్తంగా 2003 లో ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాకి దర్శకత్వం వహించాడు. అప్పట్నుంచి రాజ్ అండ్ డికె పేరుతో సినిమాలు తెరకెక్కించుకుంటూ వస్తున్నాడు. హిందీలో ఎక్కువగా సినిమాలు చేసే రాజ్ తెలుగులో డి ఫర్ దోపిడీ, సినిమా బండి వంటి సినిమాలకి నిర్మాతగా వ్యవహరించాడు. రాజ్ ఆస్థి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



