English | Telugu

కుర్రాడు మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నాడు



ఒక‌ట్రెండు సినిమాలు చేయ‌గానే, అవి ఓ మాదిరిగా ఆడ‌గానే.. మాకంటే పోటుగాళ్లు లేరు అనుకొంటున్నారు కొంత‌మంది యువ హీరోలు. అప్పుడే మొల‌చిన హీరోయిజం చూసుకొంటూ మురిసిపోతున్నారు. పారితోషికాన్ని అమాంతం డ‌బుల్ చేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. కొత్త కుర్రాడు నాగ‌శౌర్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్యా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొన్నాడు నాగ‌శౌర్య‌. మొన్నే ల‌క్ష్మీ రావే మా ఇంటికి కూడా విడుద‌లైంది. తొలి రెండూ ఓ మాదిరి విజ‌యాన్ని న‌మోదు చేసుకొన్నాయి. దాంతో.. నాగ‌శౌర్య భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. రెండో సినిమాకి రూ.25 ల‌క్ష‌లు అందుకొన్న ఈ కుర్రాడు, మూడో సినిమాకొచ్చేస‌రికి రూ.60 ల‌క్ష‌లు డిమాండ్ చేశాడ‌ని టాక్‌. ఇప్పుడు నిర్మాత‌ల తాకిడి మ‌రింత ఎక్కువ అవ్వ‌డంతో రౌండ్ ఫిగ‌ర్‌గా కోటి రూపాయ‌లు చేసుకోండి... అంటున్నాడ‌ట‌. ఇది వ‌ర‌కు రూ.40 ల‌క్ష‌ల‌కే ఓ సినిమా ఒప్పుకొన్నాడ‌ట‌. ఇప్పుడు ఆ నిర్మాత‌తో ''మ‌రో అర‌వై ఇస్తే చేస్తా..'' అని లిటికేష‌న్ పెట్టాడ‌ట‌. ఇటీవ‌ల విడుద‌లైన ల‌క్ష్మీ రావే.. ఫ్లాప్ అయినా ఈ కుర్రాడు దూకుడు త‌గ్గించ‌డం లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రో హిట్టు ప‌డితే.. కుర్రాడు ఆగుతాడా..??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.