English | Telugu

ప్రముఖ హీరోయిన్ వీడియో వైరల్.. ఎక్కడో కాదు అనంతపురంలో 

హీరోయిన్ అని తక్కువ అంచనా వెయ్యకండి.. హీరోలతో పాటే వాళ్ళకి క్రేజ్ ఉంటుంది.మార్కెట్ లో సినిమా ఉన్నా లేక పోయినా అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయాన్నీ మరోసారి నిరూపించింది ప్రముఖ హీరోయిన్ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ కి ధీటుగా నటించి రౌడీ హీరోయిన్ అనే ముద్ర కూడా వేయించుకుంది. తాజాగా ఆమె వీడియో ఒకటి వైరల్ గా మారింది

నభా నటేష్ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంలోని ఎస్ వి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యింది. స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.పైగా ఇస్మార్ట్ పోరి కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వాళ్ళల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించడానికి డాన్స్ కూడా చేసింది.పైగా ఇస్మార్ట్ శంకర్ లోని చిలక చిలక పెట్టి పోరా చురక పాట కావడంతో అక్కడున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు విద్యార్థులతో కలిసి మూవీలో చేసినట్టుగానే డాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా ఇంటర్నేషనల్ డాన్స్ డే ని పురస్కరించుకొని నభా తన ఇనిస్టాగ్రమ్ లో ఆ వీడియోని అప్ లోడ్ కూడా చేసింది.

ప్రస్తుతం ఆమె ప్రముఖ నటుడు, హీరో అయిన ప్రియదర్శి తో కలిసి డార్లింగ్ అనే మూవీ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియదర్శన్, నభా ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.ప్రభాస్ టైటిల్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. గత కొంత కాలంగా హిట్లు లేని నభా కి డార్లింగ్ తో హిట్ వస్తుందేమో చూడాలి.నిఖిల్ స్వయంభు మూవీలోను చేస్తుంది

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.