English | Telugu

చిరంజీవి కాదు.. 'అఖండ-2'లో శివుడిగా ఎన్టీఆర్!

'అఖండ-2'లో శివుడిగా కనిపించేది ఎవరు?
ఇటీవల చిరంజీవి పేరు వినిపించింది
ఇప్పుడు తెరపైకి ఎన్టీఆర్ పేరు

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'అఖండ-2' గురించే చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఘోరగా బాలయ్య తాండవం చేయనున్న ఈ సినిమాలో శివుడి పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా చిరంజీవి పేరు వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని, 'అఖండ-2'లో శివుడిగా సీనియర్ ఎన్టీఆర్(నందమూరి తారక రామారావు) కనిపిస్తారని న్యూస్ వినిపిస్తోంది.

పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు సహా ఎన్నో పాత్రలకు జీవం పోసి, భారతదేశంలో పౌరాణిక పాత్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరుపొందారు. 1962లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'దక్షయజ్ఞం'లో శివుడి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు 'అఖండ-2' రూపంలో మరోసారి ఎన్టీఆర్ ని వెండితెరపై శివుడిగా చూసే అదృష్టం కలగనుందని అంటున్నారు.

Also Read: 'అఖండ'కు నాలుగేళ్లు.. అబ్బాయ్ ట్వీట్ కి బాబాయ్ ఫ్యాన్స్ రియాక్షన్..!

ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. దివంగత నటుడు ఎన్టీఆర్ ని మళ్ళీ తెరపై శివుడిగా కనిపించేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే 'అఖండ-2' చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందట. పతాక సన్నివేశాల్లో శివుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారని వినికిడి. అదే నిజమైతే.. నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా, తెలుగు సినీ అభిమానులందరికీ ఆ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనడంలో సందేహం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.