English | Telugu

'ఫస్ట్ డే' దండయాత్ర ఎన్టీఆర్ దే ..!

ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగులో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అందుకు కారణం వారికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణే. అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల విషయానికొస్తే ఇప్పటి వరకు టాలీవుడ్లో టాప్ 10 లో ఉన్న జాబితాలో ఈ నలుగురు హీరోల సినిమాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ నటించిన సినిమాలే 4 ఉండగా….రామ్ చరణ్ మూడు సినిమాలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అయితే, అత్తారింటికి దారేది సినిమా రూ.10.75 కోట్ల కలెక్షన్ తో పవన్ ఈ లిస్టులో టాప్ లో ఉండగా ఇప్పుడు టెంపర్ తో ఎన్టీఆర్ రూ.9.68 కోట్ల వసూలుతో మూడో ప్లేసులో ఉన్నారు. అయితే, వీరిద్దరి మధ్య లో మహేశ్ బాబు ఆగడు రూ.9.74 కోట్లతో రెండో స్థానంలో ఉంది. నిజానికి టాప్ లో పవన్ ఉన్నా… టాప్ టెన్ లిస్టులో ఎక్కువ సినిమాలు ఉన్న హీరోగా మాత్రం ఎన్టీఆర్ టాప్ లో ఉన్నారు. ఎన్టీఆర్ నాలుగు సినిమాలు టెంపర్, బాద్ షా, రభస, రామయ్య వస్తావయ్యా ఈ లిస్టులో ఉన్నాయి. పవన్ వి మూడు సినిమాలే ఈ లిస్టులో ఉన్నాయి. దీంతో మొదటి రోజు వసూళ్ల రికార్డుల్లో ఎక్కువ సినిమాలున్న హీరోగా ఎన్టీఆర్ టాప్ లో నిలిచినట్లయింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.