English | Telugu

మృణాల్‌కి సీన్ టు సీన్ నేర్పిందెవ్వ‌రో తెలుసా?

మృణాల్ ఠాకూర్ అనగానే ఆమె చేసిన సీతారామ‌మ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు నానితో చేస్తున్న హాయ్ నాన్న గుర్తుకొస్తుంది. వెంట‌నే ఆమెకు సీన్ టు సీన్ నేర్పిన న‌టులుగా దుల్క‌ర్ స‌ల్మాన్, నాని పేర్లు ఇలా ఫ్లాష్ అవుతాయి. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ చెబుతున్న‌ది న‌యా జాన‌ర్ గురించి. అందులోనూ, ఆమె చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి. సౌత్‌లో హ్యాండ్ ఫుల్‌గా మూవీస్ ఉన్నాయి క‌దా అని, నార్త్ ని ప‌క్క‌న పెట్ట‌డం లేదు మృణాల్ ఠాకూర్‌. అక్క‌డా, ఇక్క‌డా బ్యాల‌న్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆమె న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆంఖ్ మైఖోలి. ఈ ప్రాజెక్టులో ప‌రేష్ రావెల్‌తో క‌లిసి ప‌నిచేశారు మృణాల్ ఠాకూర్‌.

బాలీవుడ్‌లో ఆల్రెడీ ల‌వ్ సోనియా, సూప‌ర్ 30, బాట్లా హౌస్ సినిమాల‌తో ఫేమ్ తెచ్చుకున్నారు మృణాల్‌. లేటెస్ట్ గా ఆమె ఆంఖ్ మైఖోలిలో న‌టించారు. ఇందులో ప‌రేష్ రావ‌ల్ ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాన‌ని అన్నారు మృణాల్‌. ఈ ప్రాజెక్టు చేస్తున్న‌న్ని రోజులూ త‌ను క్లాసుల‌కు వెళ్తున్నంత బుద్ధిగా వెళ్లాన‌ని చెప్పారు మృణాల్‌. కామెడీ క్లాసుల‌కు వెళ్తే ఎన్ని విష‌యాలు నేర్చుకుంటానో, ఈ క్లాసుల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా అన్నే విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నారు మృణాల్‌. అయితే ఇక్క‌డ నేర్పించి, డ‌బ్బులు ఇచ్చార‌ని అన్నారు. ప‌రేష్ రావ‌ల్‌తో చేసిన ప్రతి స‌న్నివేశం త‌న‌కు ఎంతో నేర్పింద‌ని చెప్పారు ఈ బ్యూటీ. అభిమ‌న్యు దాసానితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఆస‌మ్ అని అన్నారు.

మామూలుగా తాను నేర్చుకున్న లైన్ల‌ను య‌థాత‌థంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు మృణాల్‌. అయితే ఈ విష‌యం గురించి ప‌రేష్ ఇచ్చిన స‌ల‌హాని తాను జీవితాంతం మ‌ర్చిపోన‌ని అంటారు. కొన్ని సంద‌ర్భాల్లో లైన్ల‌ను మ‌ర్చిపోయి ప్రాంప్టింగ్ తీసుకుంటున్న‌ప్పుడు, ఎదుట ఉన్న న‌టుడు ఆ సీన్‌ని టేకోవ‌ర్ చేసేస్తార‌ని, మంచి న‌టులు ఆ అవ‌కాశాన్ని ఎప్పుడూ ఇవ్వ‌కూడ‌ద‌ని ప‌రేష్ స‌ల‌హా ఇచ్చార‌ట మృణాల్‌కి.