English | Telugu

ఆ బ్రాండ్ కూడా మహేష్ ఖాతాలోకే..


అదేంటో ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాట్లేదు. చూసిన రెండు నిముషాలకే పడిపోతుంది ప్రతీది... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రిన్స్ చెప్పిన ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇది అన్న సందర్భం వేరైనా అర్థం మాత్రం ఇప్పుడు మహేష్ వున్న సిట్యువేషన్ కి సరిగ్గా సరిపోతుంది. ఎలా అంటే, మార్కెట్లో బ్రాండ్ లన్నీ మహేష్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఆల్‌రెడీ పది బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న మహేష్‌ను వెతుక్కుంటూ మరో కంపెనీ వచ్చింది. పారగాన్ పాదరక్షల సంస్థ తమ కంపెనీ ప్రచారం బాధ్యత కూడా ప్రిన్స్ కే అప్పచెప్పింది. అతిథి సినిమా తర్వాత 3 ఏళ్ల పాటు ఏ సినిమాలో నటించక పోయినా ఆయన కమర్షియల్ ఆడ్స్‌లో కనిపిస్తు అలరించాడు. ఇప్పుడు సినిమాలు, యాడ్స్, దేశంలో "మోస్ట్ డిసైరబుల్ మ్యాన్" కితాబులు, ఇలా అన్నీ మహేష్‌ని వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు, క్రికెట్ స్టార్‌లు కూడా మహేష్ కు ఈ విషయంలో పోటీ ఇవ్వలేక పోతున్నారు. మహేష్ మానియాని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.