English | Telugu

మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత!

మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు.

శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి దంపతులు మోహన్ లాల్ నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం తెలుపుతున్నారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!

శాంతకుమారి, విశ్వనాథన్ నాయర్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మోహన్‌లాల్. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వనాథన్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. మోహన్‌లాల్ సోదరుడు కూడా 2000లో గుండెపోటుతో మృతిచెందారు.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం