మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!
on Dec 30, 2025

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Venkatesh) కలిసి చిందేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదలైంది. (Mana Shankara Varaprasad Garu)
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ గా మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చింది. (Mega Victory Mass Song)
చిరంజీవి, వెంకటేష్ లపై చిత్రీకరించిన పార్టీ సాంగ్ ఇది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందరూ కాలు కదిపేలా ఎనర్జిటిక్ గా ఉంది. "మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైన్టీ.. ఎవడైతే ఏంటి" అంటూ క్యాచీ లిరిక్స్ తో అందరూ పాడుకునేలా పాటను రాశారు కాసర్ల శ్యామ్. "ఏంది బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి..." వంటి లైన్స్ ఫ్యాన్స్ హమ్ చేసుకునేలా ఉన్నాయి. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగా సింగర్స్ నాకాష్ అజిజ్, విశాల్ దద్లాని ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు.
ఇక లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి వైబ్ కి తగ్గట్టుగా ఇద్దరూ పంచెకట్టుతో కనిపించడం అదిరిపోయింది. మెగా, విక్టరీ ఫ్యాన్స్ కి ఈ సాంగ్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



