English | Telugu

షాకింగ్ నిజాలు బయటపెట్టిన మోహన్ బాబు ఇంటి పనిమనిషి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఆయన రెండవ కుమారుడు ప్రముఖ హీరో మనోజ్(manoj)మధ్య ఆస్తులకి సంబంధించిన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.మోహన్ బాబు అయితే ఏకంగా మనోజ్ వల్ల ప్రాణ హాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగగా, మనోజ్ మాత్రం తనకి ఆస్తులపై వ్యామోహం లేదని, తన భార్య,కూతురు పై కుట్ర పన్నుతున్నారని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.

రీసెంట్ గా మోహన్ బాబు ఇంట్లో ఎప్పట్నుంచో చేస్తున్న పని మనిషి మాట్లాడుతు మోహన్ బాబు, మనోజ్ కి మధ్య స్టాఫ్ విషయంలో గొడవ జరిగింది.నా స్టాఫ్ ని నువ్వు ఏమనద్దని
మనోజ్ ని మోహన్ బాబు నెట్టగానే మనోజ్ కూడా మోహన్ బాబు ని నెట్టాడు. విష్ణు, మనోజ్ మధ్య కూడా ఎప్పట్నుంచో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా మౌనిక ని పెళ్లి చేసుకున్నాక పెద్దగా మాటలు లేవు.ప్రస్తుతం మనోజ్,మౌనిక ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయారు.విష్ణు(vishnu)అన్నకి మోహన్ బాబు గారంటే ప్రాణం.ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు.అలాంటిది మనోజ్ నెట్టాడని తెలిస్తే అసలు ఊరుకోడు .మనోజ్ కి పాప పుట్టినప్పుడు కూడా మోహన్ బాబు కుటుంబం లక్ష రూపాయిలు ఇచ్చిందని చెప్పింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.